Sunday, August 22, 2010

Nice weekend @ America

అవును...నేను ముందు చెప్పినట్లు మంచి స్నేహితులు ఉంటే కష్టాలు కనిపించవు. భూమి మీద మూల వున్నా మన వూరిలో ఉన్నట్టే వుంటుంది.

కుకట్ పల్లి లో భువన విజయం గ్రౌండ్ లాంటి గ్రౌండ్ అమెరికా లో కూడా అదీ మా ఇంటి దగ్గర వుంటుంది అని, నా లాంటి ఆట రాని మరో ఆరుగురు software engineers తో కలసి పొటుగాడిలా cricket bat పట్టుకుని వెళ్తానని అనుకోలేదు.
హ్యాపీ గా ఆరుగురం numbers వేసుకుని బాస్కెట్ ని వికెట్ లా పెట్టి వాటర్ బాటిల్ ని ఇంకో పక్క వికెట్ లా పెట్టి మనిషికి మూడు వోవర్ల చొప్పున కొమ్మేసాం! Ofcourse నేను మూడో బంతి కీ అవుట్ అనుకోండి!

తరువాత volley ball కూడా ఆడేసాను. ఇది కొంచెం పర్వాలేదు. ఐనా నేనేమైన కప్పులు కొట్టుకుని రావాలా ఏంటి?
కాసేపు ఆట విడుపు. రోజు లో కొంచెం కొత్తగా....ఏదో రాత్రి పడుకోనీ ముంది అరగంట బ్లాగ్ లో రాసుకోటానికి తప్పితే...

1 comment: